ఆటో బోల్తా పడి భక్తులకు గాయాలు

శ్రీశైలం సాక్షి గణపతి ఆలయం వద్ద ఆదివారం ఓ ఆటో బోల్తా పడి నలుగురు భక్తులు గాయపడ్డారు. అడవి పంది అడ్డుగా రావడంతో ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. క్షతగాత్రులను దేవస్థానం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక భక్తుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అడవి పందుల సంచారంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్