డా. బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం

డా. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సున్నిపెంటలోని పాత మార్కెట్ వద్ద నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వేశపోగు కమలాకర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం డా. బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్