కృష్ణా నది పరివాహక ప్రాంతాల నుంచి భారీగా నీరు చేరడంతో శ్రీశైలం జలాశయానికి శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో 4,24,678 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. వరద నియంత్రణ చర్యల్లో భాగంగా డ్యాం యొక్క 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి, 3,76,392 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ వైపు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 883 అడుగులుగా ఉందని అధికారులు వెల్లడించారు.