మహానందిలో పిడుగు పడి కూలిన చెట్టు

మహానంది మండల పరిసర గ్రామాల్లో శనివారం తెల్లవారుజామున ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాజులపల్లె మౌలాలి స్వామి దర్గా వద్ద పెద్ద చెట్టుపై పిడుగు పడటంతో ఆ చెట్టుతో పాటు విద్యుత్ స్తంభం కూడా నేలకూలింది. దీనివల్ల ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్