కొలిమిగుండ్ల: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

కొలిమిగుండ్ల మండలం బెలుము గ్రామంలో కవిత అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం, కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమయ్యాయని తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్