శ్రీశైలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చిరుత పులుల కలకలం

శ్రీశైలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చిరుత పులుల కలకలం రేగింది. కళాశాల ప్రాంగణంలో రెండు చిరుతలు సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. ఘటన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాచ్‌మెన్‌ను గమనించిన చిరుతలు లోపలికి ప్రవేశించకుండా వెనుదిరిగినట్లు సమాచారం. దీంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. వెంటనే అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతలను పట్టుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్