తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ఏర్పాటు చేసారని పాఠశాలల కరస్పాండెంట్లు సిధిన్ సాముయెల్, శ్రీను పేర్కొన్నారు. గురువారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని క్రీస్తు జ్యోతి, శివరామకృష్ణ, సాయి గీతాంజలి పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్, టీచర్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.