ఆత్మకూరు: ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తికి తీవ్ర గాయాలు

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు కింద పడి బోయ బాలన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం నంద్యాలకు వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా, డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును కదిలించడంతో బాలన్న కిందపడిపోయారు. బస్సు టైర్ ఆయన కాలిపై నుంచి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు ఆరోపించారు. స్థానికులు వెంటనే బాలన్నను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్