వెలుగోడులో 100 పడకల గిరిజన వసతి గృహం ప్రారంభించిన ఎమ్మెల్యే

వెలుగోడులో గురువారం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏపీ జన్మన్ పథకం నిధులతో 2.75 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల గిరిజన విద్యార్థుల వసతి గృహాన్ని ప్రారంభించారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన వసతి, విద్యా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ వసతి గృహం నాణ్యమైన విద్యకు దోహదపడుతుందని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్