తేదీ ఖరారు చేస్తే ఎక్కడికైనా చర్చకు సిద్ధం

నంద్యాల జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వ్యాఖ్యలకు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాయలసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, తేదీ ఖరారు చేస్తే ఎక్కడికైనా రావడానికి సవాల్‌ను స్వీకరిస్తున్నానని కాటసాని ప్రకటించారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

సంబంధిత పోస్ట్