శ్రీశైలం హుండీ కలెక్షన్‌లో రికార్డు ఆదాయం

కార్తీక మాసంలో శ్రీశైలం దేవస్థానం హుండీల్లో రికార్డు స్థాయిలో కానుకలు వచ్చాయి. 33 రోజుల లెక్కింపులో రూ. 7.27 కోట్ల నగదు, 117.800 గ్రాముల బంగారం, 7.230 కిలోల వెండి, విదేశీ కరెన్సీ నోట్లు భక్తుల నుంచి సమకూరాయి. పటిష్ఠ భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య మంగళవారం జరిగిన ఈ లెక్కింపు, భక్తుల అచంచలమైన భక్తికి నిదర్శనంగా నిలిచింది.

సంబంధిత పోస్ట్