భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున సమేత శ్రీశైలం దేవస్థానంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఈవో శ్రీనివాసరావు శుక్రవారం భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆలయం పరిధిలో అన్ని చోట్ల పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం పోలీసుశాఖ నుంచి సహాయక సహకారాలు తీసుకోవాలని చెప్పారు.