శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుముడి కలిగిన శివస్వాములకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో, ఈనెల 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్పర్శ దర్శనాన్ని రద్దు చేసింది. శివస్వాములకు మాత్రమే విడతల వారీగా స్పర్శదర్శనం కల్పించనుంది. ఈ నెల 7 వరకు సాధారణ భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంది. ఆన్‌లైన్‌లో స్పర్శ దర్శనం కోసం భారీగా నమోదు చేసుకుంటున్నారు. శివస్వాములు కూడా ఆలయానికి తరలి రావడంతో దర్శనానికి సమయం పడుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.