YCP ఎమ్మెల్యేకు శ్రీశైలం దేవస్థానం నోటీసులు

శ్రీశైలం దేవస్థానానికి చెందిన కాటేజీని మూడు సంవత్సరాలుగా సొంతానికి వాడుకుంటున్నారని, వెంటనే అప్పగించాలని దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డికి ఆదివారం దేవస్థానం నోటీసులు జారీ చేసింది. బూచేపల్లి కుటుంబం శ్రీశైలంలో కాటేజీ నిర్మాణానికి స్థలం తీసుకుని నిర్మించుకుంది. నిబంధనల ప్రకారం, 2023లోగా కాటేజీని అప్పగించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 18వ తేదీలోగా కాటేజీని అప్పగించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్