శ్రీశైలం పాతాళగంగ పరిసరాల్లో చిరుత పులి సంచారం స్థానికులను, భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. నిన్న రాత్రి ఒక చిరుత ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గత అక్టోబర్ 15న పాతాళగంగా మెట్ల మార్గం సమీపంలో చిరుత మృతి చెందిన ఘటన మరవకముందే, మళ్లీ చిరుత ప్రత్యక్షం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించాలని ప్రజలు కోరుతున్నారు.