బుధవారం అర్ధరాత్రి బేతంచెర్ల మండలం ఆర్. ఎస్. రంగాపురంలో స్నేహితుడే స్నేహితుడిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన మహబూబ్ బాషా (41)పై స్నేహితుడు బోయ మదనభూపాల్, భార్యతో సాన్నిహిత్యం ఉందని అనుమానంతో తెల్లవారుజామున నిద్రలో ఉన్న బాషాను బళ్లెంతో పొడిచి, రోకలి బండతో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై సీఐ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు.