నంద్యాల జిల్లా తమ్మడపల్లికి చెందిన సైనికుడు భాష్యం మహేష్ తన 2.38 ఎకరాల భూమిని టీడీపీ నాయకుడు కంచర్ల శివ, అతని అనుచరులు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ వీడియో విడుదల చేశారు. తన భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఆవేదనను అర్ధం చేసుకొని తన భూమి కబ్జా కాకూండా కాపాడాలని వేడుకుంటున్నారు.