ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

శనివారం సంజామల మండలం రామభద్రునిపల్లె మలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. పేరుసోముల గ్రామానికి చెందిన డ్రైవర్ షరీఫ్, నాపరాళ్ల లోడుతో వెళ్తుండగా కారును తప్పించబోయి అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఇంజన్ కింద చిక్కుకున్న డ్రైవర్‌ను స్థానికులు వెంటనే సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్