మహానందిలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి

మహానందిలోని తెలుగు గంగ కాలనీ సమీపంలో సుమారు 70 ఏళ్ల వయసు గల గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్లు ఏఎస్ఐ మౌలాలి వెల్లడించారు. ఘటన స్థలాన్ని తహశీల్దార్ రమాదేవి పరిశీలించి వివరాలు సేకరించారు. అధికారులు మృతదేహాన్ని అనాథ శవంగా గుర్తించి అంత్యక్రియల ప్రక్రియ చేపట్టారు.

సంబంధిత పోస్ట్