రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

మహానంది మండలం బుక్కాపురం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బీపురం గ్రామానికి చెందిన రవితేజ అనే యువకుడు మృతి చెందాడు. స్థానిక చర్చి సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన రవితేజను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్