చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన దివ్యాంగుడు లింగన్న

ఎమ్మిగనూరు మండలం, గువ్వలదొడ్డి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో దివ్యాంగుడు, చైల్డ్ ప్రొటెక్షన్ జిల్లా కన్వీనర్ డా.ఈ.లింగన్న పాల్గొన్నారు. ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తూ, పోలియో వచ్చిన తనలాంటి పరిస్థితి ఏ చిన్నారికి రాకూడదని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్