ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపులో భాగంగా ఎమ్మిగనూరు వైద్యుల ఆధ్వర్యంలో కోల్కత్తాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నిరసన సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైద్యులు డాక్టర్ గౌడప్ప గౌడ్ మరియు శిల్ప మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలు మానుకొనేలా. ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు పరచాలన్నారు.