గోనెగండ్ల మండలంలోని కులుమాలకు చెందిన నరేష్ బాబు (31) ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. సీఐ గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం. నరేష్ బాబు మరో యువకుడితో కలిసి నెల రోజుల క్రితం బైకుపై వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో అదుపు తప్పి బైక్ కిందపడ్డాడు. తీవ్ర గాయాలైన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కానీ చికిత్సలో కోలుకోలేక అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.