గోనెగండ్ల మండలం చిన్ననేలటూరులో అధిక అప్పులు, వడ్డీల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన రైతు బోయ మద్దిలేటి (41) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వ్యవసాయంలో నష్టాలు రావడం, అప్పుల వారి ఒత్తిడితో గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మద్దిలేటికి భార్య చంద్రమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.