గోనెగండ్ల మండలం హెచ్ కైరవాడి సమీపంలో రైతు ఉప్పరి వీరేష్, రహమతుల్లా కు చెందిన రెండు విద్యుత్ మోటార్లను గుర్తుతెలియని దుండగులు రాత్రిపూట ఎత్తుకెళ్లారు. కాలువ నీటితో పంటలను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన మోటార్లు చోరీ కావడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ. 46 వేల నష్టం జరిగినట్లు పేర్కొంటూ గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.