ఎమ్మిగనూరులో ఉచిత వైద్య శిబిరం: క్యాన్సర్ స్క్రీనింగ్, మందులు ఉచితం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప మెమొరియల్ హాల్‌లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. రావూస్ డిగ్రీ కళాశాల ఫౌండర్ కీ.శే. బూదూరు వీరారెడ్డి జ్ఞాపకార్థం రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ మరియు కళాశాల యాజమాన్యం సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ శిబిరంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, సీబీపీ, ఆర్బీఎస్, ఎఫ్ఎన్ఏసీ, పీఏపీ ఎస్ఎంఈఏఆర్ (వివాహిత మహిళలకు మాత్రమే) వంటి పరీక్షలను ప్రముఖ వైద్యులు డాక్టర్ సీ. వాసు రెడ్డి నిర్వహిస్తారు. అవసరమైన రోగులకు మందులు ఉచితంగా పంపిణీ చేయబడతాయి. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్