ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలో నివాసముంటున్న రంగస్వామి అనే రైతు ఇంట్లో ఏడు అడుగుల నాగుపాము ఆదివారం హల్ చల్ చేసింది. ఇంట్లో పనులు చేస్తున్న వ్యక్తులు పామును చూడడంతో ఒక్కసారిగా భయాందోళన చెందారు. వెంటనే బయటికి పరుగులు తీశారు. గోనెగండ్లలో నివాసం ఉంటున్న స్నేక్ క్యాచర్ పాముల అబ్దుల్ అజీజ్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే రాళ్లదొడ్డి గ్రామానికి చేరుకొని చాకచక్యంగా ఆ పామును బంధించాడు.