నందవరం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన అనూక్(14) తుంగభద్ర నదిలో ఈతకెళ్లి మృతి చెందాడు. గురువారం స్నేహితులతో కలిసి పెద్దకొత్తిలి ఒడ్డునకు వెళ్లిన అనూక్ లోతైన మడుగులో జారిపడ్డాడు. స్నేహితులు సహాయం కాపాడేందుకు ప్రయత్నం చేయగానే మృతి చెందాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. గ్రామానికి చెందిన శివ, రాణెమ్మ దంపతులు ఏకైక కుమారుడు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.