పట్టపగలు బైక్ లో నుంచి రూ. 2 లక్షలు చోరీ

ఎమ్మిగనూరులోని వైఎస్ఆర్ సర్కిల్ లక్ష్మీ స్వీట్స్ షాప్ వద్ద శుక్రవారం కెనరా బ్యాంకులో నగదు విత్‌డ్రా చేసుకుని వచ్చిన రంగారెడ్డి అనే వ్యక్తి తన బైక్ కవర్ లో ఉంచిన రూ.2 లక్షలను దొంగ ఎత్తుకెళ్లాడు. బాధితుడు స్వీట్ షాప్ వద్ద బైక్ అప్పినప్పుడు అతనిని బ్యాంక్ వద్ద నుంచి వెంబడిస్తూ వచ్చిన వ్యక్తి చోరీ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕