అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రూ. 5 వేలు అందజేత

ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా: కౌతాళం మండలం, గుడి కంబాళి గ్రామంలో నిర్మించ తలపెట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఎమ్మిగనూరు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ తరఫున రూ. 5 వేలు అందజేశారు. కమిటీ కన్వీనర్ యస్. దేవసహాయం, కో-ఆర్డినేటర్స్ కదిరికోట ఆదెన్న, జి. ఆనంద్ చైతన్య మాదిగలు శుక్రవారం గుడికంబాళి గ్రామ అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులకు ఈ విరాళం అందించారు. 2026 ఫిబ్రవరి 8న జరిగే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పార్టీలకతీతంగా దళిత, గిరిజనులు పెద్ద ఎత్తున తరలి రావాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆరెకంటి భాస్కర్, సుమాల అంతోని, గుడి కంబాళి అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు ముదకప్ప, అంపయ్య, విజయ్ కుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕