భాష్యం స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం: విద్యార్థులకు ప్రాధాన్యతపై అవగాహన

కర్నూలు, ఎమ్మిగనూరులోని భాష్యం విద్యా సంస్థలలో, చైర్మన్ రామకృష్ణ, వైస్ చైర్మన్ హనుమంతరావు, జెడిఓ కవిత ఆదేశాల మేరకు కిండర్ గార్డెన్ విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తెచ్చిన మొక్కలను పాఠశాల ఆవరణంలో తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి నాటించారు. జెడిఓ కవిత మొక్కల పెంపకం, వాటికి అవసరమైన పోషకాలు, ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగరాజు, హెచ్ఎం అనురాధ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్