15వ వార్డులో టీడీపీ విజయం

ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 15వ వార్డు నుండి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మహబూబ్ బాషా విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 237 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల మద్దతు కోరిన ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. గెలుపు అనంతరం మహబూబ్ బాషా తన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕