గోనెగండ్లలో ఘనంగా పొలం పిలుస్తుంది కార్యక్రమం.

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల, కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు 'పొలం పిలుస్తుంది' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు డాక్టర్ నసురుద్దీన్, డాక్టర్ చైతన్య, డాక్టర్ సతీష్ మాట్లాడుతూ, వాతావరణానికి అనుగుణంగా పంటల ఎంపిక, తేమ సంరక్షణ చర్యలు, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడి మొహమ్మద్ ఖాద్రి, ఏవో హేమలత, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్