కర్నూలు జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నా, ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు రూరల్ మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి శనివారం తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరువు గుర్తించినప్పుడు ఈ మూడు మండలాల్లో కరువు ఎందుకు కనిపించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.