AP: బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడంతో పాటుగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీమ్ హాజరైంది. అయితే అజయ్ బోస్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి దావోస్ వెళ్లినవారి వివరాల కోసం దరఖాస్తు చేయగా.. స్విట్జర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో ఏపీ నుంచి వెళ్లిన టీమ్‌లో మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి పేరు కూడా కనిపించింది.