AP: మంత్రి నారా లోకేశ్, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న #80s ట్రెండ్‌లో చేరారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో తన 80వ దశకం నాటి రెట్రో లుక్ ఫొటోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. "జంప్డ్ ఆన్ ది #80s ట్రెండ్" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది, మిశ్రమ వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ ఫొటోలో ఆయన వింటేజ్ కారు వద్ద 80ల నాటి స్టైల్‌లో కనిపిస్తున్నారు.