పార్టీ నేత‌ల‌పై నారా లోకేష్ సీరియ‌స్‌

తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశంలో పార్టీ నేతలపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు వారాలుగా క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ నిర్వహించని నేతలపై ఆయన సీరియస్‌ అయ్యారు. మైదకూరు, కడప, ప్రొద్దుటూరు, కమలాపురం ఎమ్మెల్యేలు, పులివెందుల, ధర్మవరం ఇన్‌చార్జ్‌లపై లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలను ఖచ్చితంగా నిర్వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్