AP: కాకినాడలో జరిగిన జనసేన నేతల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన 30-35 శాతం సీట్లు తీసుకుంటుందని, క్యాడర్, నాయకత్వాన్ని తక్కువ చేసే నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. 15% సీట్లంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలు అవగాహనా రాహిత్యమని విమర్శించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 76 స్థానాల్లో పోటీ చేసి ఉంటే కనీసం 45-50 చోట్ల గెలిచేవారమని పవన్ పేర్కొన్నారు.