AP: మంత్రి నారా లోకేశ్ బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ఆరిలోవలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అకాడమీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం ఇసుకతోట జంక్షన్‌లో విద్యార్థులకు టెక్నాలజీ శిక్షణ అందించే 'IBM ఫ్యూచర్‌నౌ సెంటర్'ను ప్రారంభిస్తారు. విశాఖ పర్యటన ముగిసిన తర్వాత, సాయంత్రం అమరావతికి చేరుకుని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.