ఈ మహోత్సవం యువతలోని ప్రతిభ, సంస్కృతి, సృజనాత్మకతను వెలికి తీసే వేదికగా నిలవనుంది. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించుకునే అద్భుత అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు Anchoring & Content, Fashion & Spotlight, Sports & Games వంటి విభిన్న బృందాలు పనిచేస్తున్నాయి.
VFSTR, విగ్నాన్ LARA, విజ్ఞాన్ ఫార్మసీ కాలేజీ విద్యార్థులు ఈ వేడుకలో వాలంటీర్లు లేదా కోఆర్డినేటర్లుగా పాల్గొనవచ్చు. గతం, వర్తమానం, భవిష్యత్తును కలిపిన అనుభూతులతో ఈ మహోత్సవం పాల్గొనేవారికి మరపురాని అనుభవాన్ని అందించనుంది.