AP: అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. విద్యార్థినిపై జరిగిన దాడిని నెటిజన్లు ఖండిస్తున్నారు. నిందితుడిని చంపేయాలంటూ సోషల్ మీడియా పోస్టులు వెల్లవెత్తుతున్నాయి. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థినిపై దాడి అమానుషమన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.