AP: విజయవాడలో నమోదైన నేవీ రహస్యాల లీకేజీ కేసులో విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో బిహార్‌లో అరెస్టయిన ఇద్దరు నిందితులను AP కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. నిందితులను విచారించిన న్యాయస్థానం వారికి నవంబర్ 10వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా 'ఆపరేషన్ ఫైర్‌వాల్'లో భాగంగా రెండో దశ దర్యాప్తుకు సంబంధించిన పలు కీలక వివరాలను సీఐ సెల్ అధికారులు వెల్లడించారు.