ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, పట్నాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సమన్వయకర్తగా ధర్మేంద్ర ప్రధాన్ వ్యవహరిస్తున్నారని, కూటమి విజయం కోసం ఆయన కృషిని లోకేశ్ అభినందించారు. గతంలో హరియాణా, ఒడిశా ఎన్నికల్లో బీజేపీ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. బిహార్‌లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేయగలదన్న నమ్మకం తనకుందని లోకేశ్ అన్నారు.