AP: అధికారుల నిర్లక్ష్యంపై వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి-జూపార్క్ రోడ్డులో వేంకటేశ్వర స్వామి వారి ఫొటోలు నిర్లక్ష్యంగా పడేశారని, ఎక్కడ చూసినా మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో టీటీడీని పరిరక్షిస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నారని, వేంకటేశ్వర స్వామి స్థలాల్లో పవిత్రంగా ఉండాల్సిన చోట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.