AP: కర్నూలు జిల్లా దేవనకొండలో ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మంగళవారం ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆర్టీసీ సిబ్బంది బస్సులో పరిమితికి మించి 230 మందిని ఎక్కించారు. దాంతో బస్సులో ఊపిరాడక నలుగురు విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే స్పందించిన కండక్టర్ విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించాడు. ఈ క్రమంలో విద్యార్థుల కోసం మరో బస్సును కూడా ఏర్పాటు చేయాలని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు.