AP: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జనసేన దూకుడు పెంచుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్‌ను తమ కోటాలోకి ఇవ్వాలని, మేయర్‌తో పాటు ఎక్కువ కార్పొరేటర్ సీట్లు అడగాలని జనసేన పట్టుబట్టే అవకాశం ఉంది. 2009 ప్రజారాజ్యం ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపుతూ, కార్పొరేషన్ పరిధిలో జనసేనకు రాజకీయంగా స్పేస్ ఉందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని స్థానిక నాయకులు భావిస్తున్నారు. పార్టీ బలాన్ని పెంచుకునేందుకు కీలక నాయకులను చేర్చుకునే దిశగా ఆలోచిస్తున్నారు.