రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం అంకురార్పణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఉదయం ప్రత్యేక పూజలు, రాత్రి ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంకురార్పణ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.