శనివారం ఏ. ఎస్ పేట మండలం, హసనాపురంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన 'దొంగ నోటు' లాంటి పుస్తకాలను రద్దు చేసి, ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్తో కూడిన సురక్షితమైన పట్టాలను అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులు ఏ విధంగా కూడా ఇబ్బంది పడకూడదనే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని ఆయన అన్నారు.