మర్రిపాడు మండలం డీసీపల్లి ఎస్సీ కాలనీలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, కడప నుంచి వచ్చిన అధికారులు తిరుమలేశు అనే రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయ అటెండర్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఆయనతో పాటు ఆయన బంధువులైన రమణయ్య, శ్రీనుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.