డిసిపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రమాదం

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డిసిపల్లి టోల్ ప్లాజా వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టోల్ బూత్ కు ఓ లారీ తగిలినందువల్ల ధ్వంసం అయింది. టోల్ బూత్ లైన్లు ఇరుకుగా ఉండటంతో తరచూ ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు తెలిపారు. నిర్వహణ సరిగ్గా లేదని టోల్ సిబ్బందిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన లారీని టోల్ సిబ్బంది నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్